Ram Charan heroine Alia Bhatt About on RRR Movie Director SS Rajamouli
Ram Charan heroine Alia Bhatt About on RRR Movie Director SS Rajamouli

ఆర్ఆర్ఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే చాలు దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా చాలు అని అనుకుంటున్న తరుణంలో సినిమా షూటింగ్ ఏకంగా 70 శాతం పూర్తీ అయిందంటూ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఏంటి రాజమౌళి ఇంత తొందరగా 70 శాతం సినిమా వర్క్ పూర్తీ చేశాడా అంటూ అందరూ షాక్ అయ్యారు.

రామ్ చరణ్ సరసన RRRలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ సరసన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయంలో గతకొంత కాలం నుంచి వస్తున్న రూమర్స్ కి క్లారిటీ వచ్చేసింది. ఇలా రాజమౌళి ఎన్టీఆర్ హీరోయిన్ అంటూ లుక్ రిలీజ్ చేసాడో లేదో అలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఓ విదేశీ హీరోయిన్ ను రంగం లోకి దింపాడు రాజమౌళి. ఈమె పేరు ఒలివియా మోరిస్. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు మాత్రం జెన్నిఫర్.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా ఆలియా భట్ నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ఓ పాటకు కాలు కదపబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేయడం అయిపోయాక ఆలియా భట్ తో రామ్ చరణ్ కు డ్యూయెట్ ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ఈ రొమాంటిక్ సాంగ్ కు కీరవాణి మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్ ది చిన్న రోల్ అనే చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఆలియా భట్ స్పందించింది.. తనను కరణ్ జోహార్ సినిమాల్లోకి లాంచ్ చేసిన తర్వాత తాను సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి దర్శకత్వంలో చిన్న రోల్ అయినా చేయాలని అనుకున్నానని.. ఈ సినిమాలో తన రోల్ చిన్నదా పెద్దదా అన్నది తాను ఆలోచించలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా మాంచి రోల్ లో నటిస్తున్నాడు.