ఆచార్య లో “సిద్ధ” గా రామ్ చరణ్

396
ram-charan-is-siddha-in-acharya
ram-charan-is-siddha-in-acharya

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ లో విరామం వచ్చినా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. దేవాలయ శాఖ కుంభకోణాలు రాజకీయాల నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.

చాన్నాళ్ల నుంచి చరణ్ ఎంట్రీ ఆచార్య సెట్స్ లో ఎప్పుడు పడుతుందా అని అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎట్టకేలకు కొరటాల శివ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఓ ఫోటోను షేర్ చేసి చరణ్ చేస్తున్న రోల్ పేరును కూడా రివీల్ చేసారు. మా “సిద్ధ” సర్వం సిద్ధం అంటూ ఆచార్య లోకి చరణ్ షూట్ స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు.

ఫ్రంట్ లుక్ ఏమి చూపించనకుండా జస్ట్ వెనుక వైపు ఒక సైడ్ నుంచి చూపిస్తూ అదరగొట్టారని చెప్పాలి. చెవికి పోగు, మెడలో రుద్రాక్ష దండ ఎదురుగా కనిపిస్తున్న భారీ గుడి సెట్ వైపుగా నడుస్తున్నట్టుగా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీనితో చరణ్ రోల్ పై మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి