Ram Charan, Jr NTR, RRR Movie ,Pre Release Business, Tollywood Movie News
Ram Charan, Jr NTR, RRR Movie ,Pre Release Business, Tollywood Movie News

RRR ….బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.అయితే ఇంకా పాతిక పర్సెంట్ షూటింగ్ కూడా కంప్లీట్ కాకుండానే ఈ సినిమా బిజినెస్ పరంగా సంచలనాలు క్రియేట్ చేస్తుంది.

అప్పుడే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ క్లోజ్ అయిపోయాయి.మొత్తం అన్ని భాషలు,అన్ని దేశాల రిలీజ్ హక్కులు 65 కోట్లకు అమ్ముడు పోయాయి.దుబాయ్ కి చెందిన ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ హక్కులు దక్కించుకుంది.అంతే కాదు ఆ మొత్తం అమౌంట్ ని సింగిల్ పేమెంట్ గా సెటిల్ చేశారు.అయితే ఈ హక్కుల్లో చైనా ని మినహాయించారు.చైనా లో రిలీజ్ చేసుకునే హక్కులు మాత్రం నిర్మాత దగ్గరే ఉన్నాయి.

ఇండియన్ మూవీస్ కి,ముఖ్యంగా ఎమోషనల్ కంటెంట్ కి అక్కడ వసూళ్ల వర్షం కురుస్తుంది.అందుకే ఆ హక్కులు ఉంచుకున్నారు నిర్మాత.ఒక పాన్ ఇండియా సినిమాకి ఈ రేంజ్ లో రేటు రావడం బాహుబలి తోనే మొదలు దాంతోనే ఆఖరు అనుకున్నారు.కానీ జక్కన్న బ్రాండ్ ఊహలకు అందనంతగా పెరిగిపోయింది అని RRR నిరూపించింది.ఈ సినిమా పూర్తయ్యి,బిజినెస్ మొత్తం పూర్తయ్యేసరికి నాన్ బాహుబలి అనే మాట నాన్ RRR గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.