50 డేస్ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’

0
411
Ram Charan Jr NTR RRR Team Wrapped Up A Major Action Sequence Schedule

RRR Shooting Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటితో పూర్తయింది. ఈ షూటింగ్ విశేషాలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా సందేశం పోస్ట్ చేసింది RRR టీమ్. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వేల్యూస్‌.. బాలీవుడ్‌, హాలీవుడ్ యాక్టర్స్ కలయికలో ఈ ప్రెస్టీజియస్ మూవీ రూపొందుతోంది.

లాక్‌డౌన్ తర్వాత పునః ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ”దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. ఇక చలికాలపు రాత్రులకు గుడ్ బై.. ఇక తదుపరి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అందమైన ప్రదేశాలకు వెళ్లబోతున్నాం” అని పేర్కొంటూ ట్వీట్ చేసింది RRR టీమ్. ఈ షెడ్యూల్‌లో చెర్రీ, ఎన్టీఆర్‌లపై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశామని చెప్పింది చిత్రయూనిట్.

ఈ పోరాట సన్నివేశాలు చిత్రంలో దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటాయని తెలిస్తోంది. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా.. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌, అజయ్ దేవగణ్‌, సముద్రఖని, రే స్టీవెన్ సన్‌, అలిసన్ డూడి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టిన డీవీవీ దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో భారీ రేంజ్‌లో ఈ మూవీ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here