Homeసినిమా వార్తలుహలీవుడ్ సూపర్ స్టార్ మూవీలో రామ్ చరణ్..?

హలీవుడ్ సూపర్ స్టార్ మూవీలో రామ్ చరణ్..?

RRR Movie actor Ram Charan first hollywood movie with Tom Cruise's Top Gun 3. Ram Charan hollywood debut movie, Ram Charan in Maverick 3, Ram Charan upcoming movies

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, మెగా పవర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు RRR సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆస్కార్ వేదికపైనా సందడి చేసిన చెర్రీ.. త్వరలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

RRR చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన తర్వాత, హాలీవుడ్ మీడియా చరణ్ ను ‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’గా కొనియాడింది. ఈ క్రమంలో పలువురు హాలీవుడ్ మేకర్స్ తో డిస్కషన్స్ జరుగుతున్నట్లు అమెరికా వేదికగా చెర్రీ స్వయంగా వెల్లడించారు. లేటెస్టుగా దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి తన హాలీవుడ్ డెబ్యూపై మెగా హీరో నోరు విప్పాడు.

ఆస్కార్ తర్వాత రామ్ చరణ్ అమెరికా నుండి నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అక్కడ జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ చెర్రీ హాలీవుడ్ ప్రాజెక్టు గురించి అడిగారు. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుందని చరణ్ బదులిచ్చారు.

తప్పకుండా హాలీవుడ్ సినిమాలో నటిస్తానని.. మీ అంచనాలు తప్పకుండా అందుకుంటామని.. మీ కోరికలను తప్పకుండా నిజం చేస్తానని రామ్ చరణ్ తెలిపారు. ‘మీరు ఏదైనా ప్రాజెక్టుపై సంతకం చేశారా? ‘ అని రాజ్ దీప్ అడగ్గా.. అదంతా ప్రాసెస్ లో ఉందని చెర్రీ నవ్వుతూ చెప్పాడు.

సౌత్ జనాలు అంచనాలు తక్కువగా ఉంచుతారని, ఒక్కసారిగా అంచనాలను పటాపంచలు చేస్తారని రాజ్ దీప్ చమత్కరించారు. ఇదే క్రమంలో ‘మావెరిక్ 3’ లో టామ్ క్రూజ్ తో కలిసి నటిస్తున్నట్లు మేం వింటున్నాం అని అన్నాడు. “మా అమ్మ ఎప్పుడూ దిష్ఠి తగలకూడదని చెబుతుంది. ప్రతిభకు ప్రశంసలు లభించే ప్రతీ ఇండస్ట్రీలోనూ పని చేయాలని అందరూ కోరుకుంటారు. నేను కూడా అందుకు మినహాయింపు కాదు” అని చరణ్ చెప్పుకొచ్చారు.

త్వరలో హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రామ్ చరణ్ హింట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇంటర్నేషనల్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు తమ హీరోని చూస్తామా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి గ్లోబల్ వైడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారని అంటున్నారు.

- Advertisement -

ఇకపోతే ఇదే వేదికపై స్పోర్ట్స్ బయోపిక్ లో నటించాలని తనకు చాలకాలంగా కోరిక ఉందని రామ్ చరణ్ తెలిపారు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్లో నటించేందుకు ఇష్టపడతానని పేర్కొన్నాడు. లుక్స్ పరంగా కూడా తాను కోహ్లికి దగ్గరగా ఉంటానని, ఇది తనకు అదనపు అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు.

RRR Movie actor Ram Charan first hollywood movie with Tom Cruise’s Top Gun 3. Ram Charan hollywood debut movie, Ram Charan in Maverick 3, Ram Charan upcoming movies

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY