రామ్‌చ‌ర‌ణ్‌ రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ టీజర్

Ram Charan Launched Anubhavinchu Raja Teaser: కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన అనుభ‌వించు రాజా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  రోజు అనుభ‌వించు రాజా టీజ‌ర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా.. ‘అనుభవించు రాజా టీజర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను..మీకు కూడా నచ్చుతుంది. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని రామ్ చరణ్ అన్నారు. రాజ్ తరుణ్, డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం `అనుభవించు రాజా` .

భీమవరంలో కోడి పందెం సెటప్ ను చూపిస్తూ పందెం రాయుళ్లందరికీ స్వాగతం పలకడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. ఎనర్జిటిక్ గా ఉండే రాజ్ తరుణ్ కు బంగారం పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యాడు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు మరో ప్రధాన ఆకర్షణ.

https://www.youtube.com/watch?v=xo4c_IzJV4I&feature=youtu.be&ab_channel=AnnapurnaStudios

సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి – ఆడుకాలమ్ నరేన్ – అజయ్ – సుదర్శన్ – టెంపర్ వంశీ – ఆదర్శ్ బాలకృష్ణ – రవి కృష్ణ – భూపాల్ రాజు – అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: వాళ్లు జాతి వ్యతిరేకులే.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్!

- Advertisement -

Anubhavinchu Raja Cast Crew: రాజ్ తరుణ్, కషిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా.

 

Related Articles

Telugu Articles

Movie Articles