RC15: శంకర్ ను కలిసిన చరణ్ – దిల్ రాజు.. వివరాలు..!

0
88
Ram Charan meets Shankar in Chennai, regarding RC15 shooting

RC15 -Ram Charan – Shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య (Acharya) సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్.. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. శంకర్ మరో సినిమా చేయకుండా అడ్డుకోవాలని లైకా సంస్థ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. అలా అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. కోర్టు ప్రకటనతో శంకర్, రాంచరణ్ ల RC15 చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లు అయింది.

ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం హీరో రామ్ చరణ్ – ప్రొడ్యూసర్ దిల్ రాజు చెన్నై వెళ్లి డైరెక్టర్ శంకర్ (Shankar) ను మీట్ అయ్యారు. RC15 ప్రాజెక్ట్ గురించి చర్చించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చెన్నైలో శంకర్ – చరణ్ – దిల్ రాజు మీటింగ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలిసింది. శంకర్ ఆల్రెడీ స్ర్కిప్ట్ రెడీ చేసి చరణ్‌ ఎప్పుడంటే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయిక విషయానికి వస్తే.. కియారా అద్వానీ, ఆలియా భట్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని తెలిసింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ని ఖరారు చేసినట్టు సమాచారం. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా వెల్లడించే వరకు ఆగాల్సిందే.

పోల్: శంకర్-చరణ్ చిత్రం ఏ జోనర్ అనుకుంటున్నారు.?