ఖ‌రీదైన కారు కొనుగోలు చేసిన చ‌ర‌ణ్‌..!

0
1148
Ram Charan New Car Mercedes maybach gls600 video viral

Ram Charan New Car: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో న్యూ బ్రాండ్‌ బెంజ్‌ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇటీవలే కొన్న ఈ కారు చరణ్ ఇంటికి డెలివరీ అయ్యింది. ఈ మధ్యే యంగ్‌టైగర్‌ NTR ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ ‘లంబోర్ఘిని’ ఊరూస్‌ మోడల్‌ లగ్జరీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే చరణ్ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉండగా.. ‘మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600’ సరికొత్త కారు కూడా ఆయన షెడ్డులోకి వచ్చి చేరింది. ఈ కారు డెలివరీకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ram Charan New Car Mercedes maybach gls600 video viral

ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్ లో వున్నా ఈ లగ్జరీ కారు చూడ్డానికి ఆకర్షణీయంగా వుంది. హై సెక్యూరిటీ, లేటెస్ట్ టెక్నాలజీతో అత్యంత సౌకర్యవంతంగా వుండనుందట. ఇక చరణ్-శంకర్ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.