Ram Charan, Ntr Complaints On Rajamouli Working Style

Ram Charan Jr. NTR: Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు. బుల్లి తెర నుండి వెండి తెర వైపుకు అడుగులు వేసిన రాజమౌళి.. అపజయం అంటే ఎరుగని ఫిలిం మేకర్ గా కొనసాగుతున్నాడు. రాజమౌళిపై RRR యూనిట్ మొత్తం కంప్లైంట్స్ చేసింది. ముఖ్యంగా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్.. రాజమౌళి పనితీరు ఎలా ఉంటుందో తెలుపుతూ అన్నీ చెప్పేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన సెట్స్‌పై ఇలాగే ఉంటారంటూ ఓపెన్ అయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు దర్శకధీరుడు 48వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ విభిన్నంగా డైరెక్టర్ రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.

RRR కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాత డీవీవీ దానయ్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ వరుసపెట్టి జక్కన్నపై కంప్లైంట్స్ చేశారు. రిలాక్స్ అవుదామనుకున్న సమయంలోనే రాజమౌళి కష్టతరమైన షాట్స్ షూట్ చేద్దామంటారని జక్కన్నపై షాకింగ్ కామెంట్ వదిలారు ఎన్టీఆర్. ఒక్క షాట్ తీయడానికే బోలెడంత సమయం తీసుకుంటారని, ఆయన పర్ఫెక్షన్‌తో మమ్మల్ని చావగొట్టేస్తుంటారంటూ అన్నీ ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.