Ram Charan Orange Flavor In Vijay Devarakonda World Famous Lover Movie
Ram Charan Orange Flavor In Vijay Devarakonda World Famous Lover Movie

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న క్రేజీ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమా నుండి ఇటీవలే వచ్చిన కొత్త పోస్టర్స్ సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేశ్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇలా ఒకేసారి ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తుండటంతో సినిమాలో రామ్ చరణ్ గతంలో చేసిన ‘ఆరెంజ్’ సినిమా షేడ్స్ ఉంటాయని, ఇందులో హీరో నిజమైన ప్రేమ కోసం వెతికే యువకుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్లో ఉంటుందట.

కాగా ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌ పై మంచి అంచనాలే ఉన్నాయి. మొత్తానికి టైటిల్ కూడా బాగా క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇక ‘డియర్ కామ్రేడ్’ పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపై విజయ్ దేవరకొండ భారీ ఆశలే పెట్టుకున్నాడు.