ram charan participated in green india challenge with joginapally santosh kumar

Rajamouli: Ram Charan: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నిర్విఘ్నంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ స్వీకరించి పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తో కలిసి చెర్రీ మొక్కలు నాటాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా స్నేహితుడు ప్రభాస్ ఈ బృహత్తర కార్యక్రమంలో పొల్గొనడమే కాకుండా నాకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం అని, ప్రకృతి సమతుల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద మనగలుగుతాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపిన రామ్ చరణ్ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు తాను దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్ లతో పాటు RRR యూనిట్ మొత్తానికి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నానని అన్నారు. అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని చెప్పారు రామ్ చరణ్.

Mega Power Star Ram Charan sends out green message

ప్రస్తుతం రామ్ చరణ్ తన లేటెస్ట్ ప్రాజెక్టు RRRతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటిస్తున్నారు.