షూటింగ్ కి రెడీ అవుతున్న రామ్ చరణ్ శంకర్.. ?

RRR సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని రెండు షెడ్యూలు కంప్లీట్ చేసిన తర్వాత బ్రేక్ ఇవ్వడం జరిగింది. అలాగే శంకర్ పాత మూవీ అయినా ఇండియన్ 2 సినిమా గురించి ఈ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ RC15 షూటింగు ఎప్పుడు బిగిన్ అయిందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి శంకర్ కొన్ని రోజుల క్రితం అప్డేట్ ఇవ్వడం జరిగింది.

అయితే దీని తర్వాత RC15 షూటింగ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ RC15 షూటింగు ఈ నెల 8 నుంచి హైదరాబాదులో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా పాత ఆర్ట్ డైరెక్టర్ తప్పుకోవటంతో ఈ టైం లో ఇండియన్ 2 షూటింగ్ షురూ చేశారు డైరెక్టర్ శంకర్.

ఇప్పుడు ముత్తురాజ్ సెట్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ రెడీ చేస్తున్న సెట్స్ లోనే సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో హైద‌రాబాద్, వైజాగ్‌ (బుటలం)లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని అన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ డేట్ ని మార్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చెన్నై లో జరుగుతున్న ఈ షూటింగ్ లో కాజల్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు శంకర్ ఇండియన్ టు కంప్లీట్ చేసిన తర్వాత RC15 ఈ సినిమాని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక RC15  టైటిల్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో చాలా పేర్లు వినపడుతున్నాయి. విశ్వంభ‌ర‌, స‌ర్కారోడు, అధికారి.. ఇలాంటి పేర్లు నెట్టింట చాలానే వినిపించాయి. అయితే ఎలాంటి టైటిల్ పెట్ట‌బోతున్నార‌నేది మాత్రం అంద‌రిలో ఆస‌క్తి రేపుతోన్న అంశ‌మే.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles