రామ్ చరణ్ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ సెట్ లో – పిక్ వైరల్ !

0
111
Ram Charan back to sets of RRR Movie

Ram Charan – RRR Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు పోస్ట్ ఫోన్ అయిన షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసింది.

రామ్ చరణ్ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ సెట్ లోకి అడుగు పెట్టాడు. ఈ రోజు నుండి తన సీన్స్ కోసం షూటింగ్ చేయనున్నాడు. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్‌ మధ్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇక ముంబైకి చెందిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్, రామ్ చరణ్ స్టైల్ కోసం సెట్ కి వచ్చాడు. ఈ సందర్భంగా హకీమ్ తో చరణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఈ షెడ్యూల్‌లో అలియా భట్ ఆర్‌ఆర్‌ఆర్ సెట్స్‌లో చేరనున్నారు మరియు చరణ్, అలియాపై పెండింగ్‌లో ఉన్న పాట చిత్రీకరించబడుతుంది. ఎన్‌టిఆర్ తదుపరి షెడ్యూల్‌లో సెట్స్‌లో చేరనున్నారు, చరణ్‌పై ఒక పాట, ఎన్‌టిఆర్ చివరి షెడ్యూల్‌లో చిత్రీకరించబడుతుంది.

రాజమౌళి షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి, అధికారిక విడుదల తేదీని ప్రకటించే యోచనలో ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ జూలై చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.