Ram Charan RRR Team Shared Shooting Location Video

RRR Shooting: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. RRR యూనిట్.. ఇటీవలే తిరిగి సెట్స్ మీదకు వచ్చింది. చిత్రంలోని కీలక ఘట్టాలను తెరకెక్కించడంలో బిజీ అయ్యారు రాజమౌళి. చాలా స్ట్రిక్ట్‌‌‌గా యూనిట్ అందరితో కలిసి షూటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లొకేషన్స్‌పై తీసిన ఓ చిన్న వీడియోను షేర్ చేసింది RRR టీమ్. ఇందులో యూనిట్ అంతా చలికి వణికిపోతూ కనిపిస్తుండటం చూస్తుంటే ఈ షూటింగ్‌పై వారంతా ఎంత శ్రద్ద పెట్టారనేది స్పష్టమవుతోంది.

ఆర్.ఆర్.ఆర్ టీం ఓ వీడియో ట్విట్టర్ షేర్ చేస్తూ ‘సెట్ హీటర్స్ లేకుండా ఎవరూ ఈ చల్లని గాలుల నుంచి తప్పించుకోలేరు’ అని పేర్కొంటూ లొకేషన్స్‌ వద్ద ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకుల ముందుంచారు మేకర్స్. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్‌లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. రాజమౌళి, ఎన్టీఆర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్.. ఇలా అందరూ సెట్‌లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపిస్తున్నారు. చలి కాలం.. అందులోనూ నైట్ టైమ్ షూట్స్ అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా షూటింగ్ ఫినిష్ చేయాలనే దృఢ సంకల్పంతో టీమ్ పని చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.