కనీవిని ఎరుగని రీతిలో రామ్ చరణ్ మూవీ లాంచ్..!

0
4001
Ram charan Shankar RC15 launch on September 8

Ram Charan Shankar RC15: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను నిర్మించనుండగా సెప్టెంబర్ 8వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. బాలీవుడ్ మీడియా కూడా పూజా కార్యక్రమాలను కవర్ చేసేలా శంకర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రణవీర్ సింగ్ కూడా ఈ పూజకి వస్తారు అని తెలుస్తుంది వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనుందని తెలుస్తోంది.

థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనుండగా కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఇండియ్ 2ను పూర్తి చేయ‌కుండా ఆర్‌సీ 15ను స్టార్ట్ చేయ‌కూడ‌దని లైకా ఇప్ప‌ట‌కే అడ్డంకులు సృష్టించే ప్ర‌య‌త్నం చేసినా కుద‌ర‌లేదు. ఈ సినిమా విష‌యంలో డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు మ‌రో షాక్ త‌గిలింది.

Ram charan Shankar RC15 launch on September 8

అది కూడా క‌థ విష‌యం. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌గ్గ‌ర అసోసియేట్‌గా ప‌నిచేసే చెల్ల‌ముత్తు చ‌ర‌ణ్‌, శంక‌ర్ చేయ‌బోయే క‌థ త‌న‌దేనంటూ ద‌క్షిణాది ర‌చ‌యిత‌ల సంఘానికి ఫిర్యాదు చేశాడు. అనుకోని ఈ స‌మ‌స్యను శంక‌ర్ ఎలా అధిగ‌మిస్తాడ‌నేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.