Ram Charan- Shankar ఫస్ట్‌ పోస్టర్‌ అదుర్స్..!

0
36
Ram Charan- Shankar RC15 Movie Official Launch Poster Viral

Ram Charan RC15 Poster: స్టార్ హీరోలంతా వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. శంకర్‌ (Shankar) డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం నేడు (బుధవారం) ఉదయం హైదరాబాద్‌లో జరగనుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది. We are coming అంటూ ఈ రోజు సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దిల్‌ రాజు బ్యానర్‌లో 50వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు ముహూర్తం జరుపుకుంటోంది.

ఈ పోస్టర్‌లో రామ్ చరణ్‌తో పాటు కియారా అద్వానీ, శంకర్‌, దిల్‌రాజు, ఇతర నటీనటులందరూ సూటుబూటు వేసుకుని ఫైల్స్‌ చేతబట్టుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. అందరూ కూడా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ముందుగా వచ్చిన వార్తల ప్రకారమే ఈ సినిమాలో చరణ్‌ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు.

Ram charan and Shankar Movie RC15 Cast Crew and Photos

దానిని హింట్‌ ఇస్తూ… సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూను అధికారుల రూపంలో సూటు, బూటు వేసి పోస్టర్‌ డిజైన్‌ చేశారు శంకర్‌ దీంతో ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ‘పోస్టర్‌ అదుర్స్’ అంటూ కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేసుకుంటున్నారు.