ఆచార్య ‘సిద్ధ’మవుతున్నాడు

323
ram-charan-shared-sets-of-acharya
ram-charan-shared-sets-of-acharya

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ మూవీ ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఏడాది మే 13న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.

 

 

రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా దర్శకుడు కొరటాల, రామ్‌చరణ్‌ ఫొటోను షేర్‌ చేస్తూ ఆచార్య సిద్ధమవుతున్నాడు అంటూ పోస్ట్‌ చేశాడు.

 

 

ఈ ఫొటోపై స్పందించిన రామ్‌చరణ్‌ కామ్రేడ్‌ మూమెంట్‌..’ఆచార్య’ సెట్‌లో ప్రతి క్షణాన్ని చిరంజీవిగారితో, కొరటాలగారితో ఎంజాయ్‌ చేస్తున్నాను అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.