రామ్ చరణ్ ‘సిద్ధ’ టీజర్: గూస్ బంప్స్

0
2065
Ram Charan Siddha Teaser From Acharya Released
Ram Charan Siddha Teaser From Acharya Released

Ram Charan Siddha Teaser From Acharya: మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆచార్య ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సిద్ధ టీజర్ (Siddha Teaser) విడుదల చేశారు మేకర్స్.

రామ్ చరణ్ సిద్ధా క్యారెక్టర్ సంబంధించిన ఈ టీజర్ (Siddha Teaser) అద్భుతంగా ఉందని చెప్పాలి. 4.15 నిమిషాల పాటు సాగే ఈ వీడియో సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) పోషించిన సిద్ధ పాత్రను చూపిస్తుంది. ‘ధర్మస్థలికి ఆపద వస్తే… అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అని రామ్ చరణ్ డైలాగ్ సూపర్ గా ఉంది.

టీజ‌ర్‌లో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించారు. అలాగే, ప్రేమతో పాటు చరణ్ ఫైట్ చేయడం చూపించారు. టీజర్ (Siddha Teaser) చివర్లో చిరంజీవిది చూపించే సన్నివేశం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించిన ఈ సినిమాలో సోనూ సూద్ కీలక పాత్ర చేశారు.

Ram Charan Siddha Teaser From Acharya Released
Ram Charan Siddha Teaser From Acharya Released

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పిస్తారు. సంగీతం మణి శర్మ. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

Previous articleRam charan Siddha’s Saga Teaser From Acharya
Next articleసీనియర్ హీరోతో రొమాన్స్ కి ఓకే అన్న మెహరిన్..!