Ram Charan Special Taking Care On Sharwanand Marriage

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా తమ తమ లైఫ్ పార్ట్‌నర్ వేట ప్రారంభించారు. దీంతో ఈ లాక్‌డౌన్ విరామ సమయం సెలబ్రిటీల పెళ్లి వార్తలతో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. ఇప్పటికే నిఖిల్ (Nikhil), నితిన్ (Nithiin), దగ్గుబాటి రానా (Rana) పెళ్లి చేసుకొని కొత్త బాధ్యతలు స్వీకరించగా.. అదే బాటలో మరో యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈయన పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ కరోనా సమయంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు యంగ్ హీరోలు వివాహాలు చేసుకున్నారు. శర్వా కూడా అదే బాటలో నడవబోతున్నాడట.

ఇటీవలే ఈ ప్రేమ వ్యవహారాన్ని పెద్దల వద్దకు తీసుకెళ్లి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారనే వార్తలు చూశాం. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు శర్వానంద్ పెళ్లి కోసం విశ్వప్రయత్నాలు చేసిన వ్యక్తి ఆయన ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్ అని తెలుస్తుండటం జనాల్లో హాట్ ఇష్యూగా అయింది. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే శర్వా స్పందించాల్సిందే.