RC15 తరువాత మల్లి రాజమౌళితో రామ్ చరణ్ మూవీ..?

0
3197
Ram Charan SS Rajamouli Magadheera sequel on cards

Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’ సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ చరణ్ ను స్టార్ హీరోగా మార్చేసింది. 400 ఏళ్ల నాటి ప్రేమ కథను ఈ సినిమాలో చూపించి, ఆ కథను మళ్ళీ 21వ శతాబ్దానికి లింక్ చేయడం అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు మాస్ మరియు యాక్షన్ చిత్రాలను తేసే రాజమౌళి ఒక్కసారిగా సోసియో ఫాంటసీ చిత్రాల దర్శకుడిగా మారిపోయాడు.

ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని అప్పట్లోనే అనుకున్నారు. అప్పుడప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక ఆ సమయం ఎంతో దూరంలో లేదనే టాక్ ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ పూర్తి అవగానే చరణ్ డైరెక్టర్ శంకర్ తో ఒక మూవీ చేస్తారని, ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు తో కూడా ఒక మూవీ చేస్తారని ఇవి రెండు అయిపోగానే రాజమౌళి – రామ్ చరణ్ కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా మగధీర 2 ఉంటుందని మాటలు వినిపిస్తున్నాయి.