Ram Charan RC16 Story: RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన నటనకి చాలామంది హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. దీని తర్వాత వస్తున్న రామ్ చరణ్ యాక్షన్ పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్. ఈ సినిమాని శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గేమ్ చేంజర్ (Game Changer) షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. అయితే దీని తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
Ram Charan RC16 Story: బుచ్చిబాబు సానా మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడికి సినిమా అవకాశాలు వరుసగా వస్తాయి అని అందరూ అనుకున్నారు. అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు తనకి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు రూమర్ అయితే ప్రచారం జరిగింది. రెండేళ్లు ఖాళీగా ఉన్న తర్వాత దర్శకుడు బుచ్చిబాబు – రామ్ చరణ్ RC16 సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది.
RC16 స్టోరీ కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పిలిచి అవకాశం ఇవ్వటంతో బుచ్చిబాబు తన దర్శకత్వంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే RC16 స్టోరీ (Story) ఇదే అంటూ వెబ్ మీడియాలో చాలా ప్రచారాలు జరిగాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి పాత్రలో చరణ్ కనిపిస్తారని.. అలాగే ఈ సినిమాలో డబల్ రోల్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనిని గమనించిన రామ్ చరణ్ (Ram Charan) టీమ్ క్లారిటీ ఇచ్చారు. బుచ్చిబాబు అలాగే రామ్ చరణ్ వస్తున్న సినిమా కోడి రామ్మూర్తి బయోపిక్‌లో కాదని అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే సినిమానేనని స్పష్టం చేయటం జరిగింది.
RC16 షూటింగ్ డేట్ ఇదే:
రామ్ చరణ్ ఫాన్స్ RC16 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందని చాలా ఆతృతగా ఎదురు. ఈ భారీ బడ్జెట్ సినిమాని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో సతీష్ కిలారు నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సమాచారం మేరకు RC16 సినిమాని సెప్టెంబర్ నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకొని అక్టోబర్ నుండి షూటింగ్ కు వెళ్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.