ఆచార్యలో.. రామ్ చరణ్‌కి జోడిగా రష్మిక ?

0
715
Ram Charan To Romance Rashmika Mandanna In Aacharya

Ram Charan, Rashmika Mandanna In Acharya : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రాన్ని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరు – చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. చిరు ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ పాత్ర ఉంటుందట.. కథను మలుపు తిప్పేలా ఈ పాత్ర ఉండబోతుందట.. అయితే ఇందులో ఆ పాత్రకి జోడి కూడా ఉంటుందని, ఆ పాత్రని కన్నడ భామ రష్మిక మందన్నా చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..

రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. మరి చివరికి రామ్ చరణ్ పక్కన ఏ బ్యూటీని ఫైనలైజ్ చేస్తారో చూడాలి. ఇక ‘ఆచార్య’ షూటింగ్ త్వరోనే తిరిగి ప్రారభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది..