Ram Charan New Business: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో రామ్ చరణ్ ఒకళ్ళు. మొదటిలో రామ్ చరణ్ సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని రోజుల తర్వాత కొన్ని బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత సొంతగా బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవే కాకుండా రామ్ చరణ్ తన సొంత బిజినెస్ లు కూడా ఉన్నాయి. మిగతా టాలీవుడ్ నటులతో పోలిస్తే రామ్ చరణ్ సంపద కొంచెం పెద్దదే అని చెప్పాలి. తాజాగా ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Ram Charan New Business: ప్రస్తుతం ఉన్న పాపులర్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ (Cricket) మాత్రమే. ఐపీఎల్ జట్టు కొనుగోలు ఎలా చేస్తారు దాని వల్ల వచ్చే లాభాలు అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్ జట్టు కొనుగోలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు పది జట్లు ఉన్న ఐపీఎల్ కి (IPL) ఇంకో జట్టు ఆడ్ చేసే అవకాశం లేదు. కానీ రామ్ చరణ్ ఐపీఎల్ లో కాకుండా ఏపీఎల్ జట్టుని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) (APL) ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రికెటర్స్ ని ప్రమోట్ చేసే దిశగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మొదటి లీగ్ మ్యాచ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) ఇంకో జట్టుని ఏపీఎల్ (APL) పరిచయం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. మొదటి లీగ్ లో ఆరు జట్టులు ఉండగా వాటిలో కొన్ని ప్రముఖ వ్యాపారవేత్తలు కొనుగోలు చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కొంతమంది యువ క్రికెటర్స్ వెలుగులోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే.
ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏమిటంటే ఈ ఉన్న ఆరు జట్టులో రామ్ చరణ్ (Ram Charan) కొనుగోలు చేయబోతున్న టీం పేరు ఏమిటంటే వైజాగ్ వారియర్స్ (Vizag Warriors).. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయని ఒకవేళ గనుక రామ్ చరణ్ (Ram Charan) క్రికెట్ ఏపీఎల్ లో భాగమైతే మరి కొంతమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారంటూ వైజాగ్ వారియర్స్ యాజమాన్యం రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో కామెంట్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ డీల్ సంబంధించిన వివరాలన్నీ మరికొన్ని రోజుల్లో బయటికి వస్తాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ గనుక ఇదే జరిగితే టాలీవుడ్ నటుల్లో బిజినెస్ పరంగా రామ్ చరణ్ మొదటి స్థానంలో ఉంటారు.
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఉప్పెన ఫ్రేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా రామ్ ఉంది.
Web Title: Ram Charan wants to buy APL cricket team, Ram Charan new business details, Ram Charan net worth, Ram Charan upcoming movie updates