సూపర్ డూపర్ హిట్ మూవీ ‘దేవదాసు’ తర్వాత రామ్ నటించిన సెకండ్ ఫిల్మ్ ‘జగడం’. అలానే తొలి చిత్రం ‘ఆర్య’తో సూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘జగడం’. మార్చి 16కి ఈ మూవీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. నటుడిగా రామ్ కు, దర్శకుడిగా సుకుమార్ కు ‘జగడం’ మంచి పేరే తెచ్చిపెట్టింది. కానీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.
అందులో పాటలు ఇప్పటికీ కుర్రకారుని కిర్రెక్కిస్తూనే ఉంటాయి. అలానే రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ గురించి ఇప్పుటికీ ఫిల్మ్ లవర్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ ఆ రోజున మాత్రం ఈ సినిమాను చూసి చాలామంది పెదవి విరిచారు. ఎంత గొప్పగా మాట్లాడుకోవాలో అంత గొప్పగా అప్పుడు మాత్రం మాట్లాడుకోలేదు. బహుశా రామ్ ఫ్యాన్స్ అతన్ని ‘దేవదాసు’లోని పాత్రతో ఊహించుకుంటే… సుకుమార్ ఫ్యాన్స్ ‘ఆర్య’ లాంటి మూవీని ఎక్స్ పెక్ట్ చేసి ఉండొచ్చు.
మార్చి 16కి ఈ మూవీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రామ్ ఫాన్స్ ‘AMB CINEMAS ‘ లో రేపు సాయంత్రం 4 గంటలు కు జగడం స్పెషల్ షో ప్లాన్ చేస్తునారు