ram gopal varma announces corona virus movie release date

RGV coronavirus movie: రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా ఆరున్నర నెలలుగా మూతబడి ఉన్న థియేటర్స్.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో తెరుచుకోనున్నాయి. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

అయితే ముందుగా ఏ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు అని సినీ ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే నేనే ముందు వస్తున్నా అంటూ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాని రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడు. `మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది` అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.