పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు షాక్ ఇస్తూ.. సినిమా రిలీజ్

0
135
ram gopal varma kamma rajyam lo kadapa reddlu New Release date
ram gopal varma kamma rajyam lo kadapa reddlu New Release date

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విషయంలో వర్మ కాంపౌండ్ తెగ టెన్షన్ పడిన సంగతి తెలిసిందే. గత వారమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందులు ఈ సినిమా విడుదలవ్వకుండా చేశాయి. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని పేరు మార్చి సెన్సార్ కు పంపారు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, వివాదాస్పద అంశాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారనీ.. ప్రముఖులను కించపరిచే సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు వర్మకు షాక్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. కొందరు నాయకుల దగ్గర నుండి క్లీన్ చిట్ తీసుకొని రమ్మని చెప్పారంటూ వార్తలు కూడా రావడంతో సినిమా విడుదల కాదేమో అని అనుకున్నారు. ఓ వర్గం కూడా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వదంటూ తెగ ప్రచారం చేసింది. కానీ అనుకున్నది ఒక్కటి జరిగింది ఒక్కటి. ఏ మాత్రం వెనక్కు తగ్గని ఆర్జీవీ.. సినిమా రిలీజ్ కాబోతోందంటూ ప్రకటించేశాడు. దీంతో కొందరు బడా బడా రాజకీయనాయకులు కూడా షాక్ అయ్యారు.

సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను అని ఆయన ట్వీట్ చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ కాగా.. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.సారీ సారీ.. అలవాటులో పొరపాటు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నామని మరోసారి సెటైర్లు వేశాడు వర్మ.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చిందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం లేదనీ.. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నానన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here