Ram Gopal Varma Kamma Rajyam Lo Kadapa Reddlu movie title change to Amma Rajyam Lo Kadapa Biddalu
Ram Gopal Varma Kamma Rajyam Lo Kadapa Reddlu movie title change to Amma Rajyam Lo Kadapa Biddalu

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం విడుదలకు దగ్గరవుతున్న సమయంలో సంచలన విషయాన్ని చెప్పాడు రాంగోపాల్ వర్మ. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్పు చేసినట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. నవంబర్ 29న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కోర్టులో కేసుల కారణంగా విడుదల అవుతుందా లేదా అన్న విషయం ఆ దేవుడికే ఎరుక..!

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలో తనను అగౌరవపరిచేలా పాత్రను చిత్రీకరించారని కేఏ పాల్ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే . సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని నిర్మాతలను కోర్టు ఆదేశించగా.. సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని కోర్టుకు నిర్మాతలు తెలిపారు.

ఇంటర్వ్యూ లలో కేఏ పాల్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే పెట్టారని విమర్శించారు. కమ్మ కులస్తులను ‘ఇన్సల్ట్’ చేసి, రెడ్డీస్ ను ‘హైలైట్’ చేసేలా ఓ రెడ్డి కులస్తుడు వర్మకు రూ.5 కోట్లు ఇచ్చారని ఆరోపించారు పాల్. కేవలం, డబ్బు కోసం రెండు కమ్యూనిటీల మధ్య గొడవలు పెట్టేందుకు చూస్తున్నారని.. పిచ్చోళ్లు తప్ప, మంచి వాళ్లెవ్వరూ ఈ సినిమా చూడరని అన్నారు. ఈ సినిమాను థియేటర్లకు రాకుండా చేసి తీరుతానని.. తాను వేసిన పరువు నష్టం కేసులో డబ్బులు కట్టలేక ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని కేఏ పాల్ అన్నారు. రాంగోపాల్ వర్మ తీరు కారణంగా ఆయనతో ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రావడం లేదని.. నిర్మాతలు దొరకడం లేదని అన్నారు. సినిమాలు తీయడం కోసం తన వద్దకు ఫండింగ్ కోసం వర్మ ఓసారి వచ్చాడని.. తనకు పాదసేవ కూడా చేసుకున్నాడని.. ఆయన తీరు నచ్చక తాను ఎలాంటి సహాయం చేయలేదని మరో బాంబును పేల్చారు కెఏ పాల్.