యూత్ కుదిపేస్తోన్న ‘దిమాక్ ఖరాబ్’ !

ram ismart shankar movie dimag kharab video song is trending
ram ismart shankar movie dimag kharab video song is trending

డైనమిక్ డైరెక్టర్ పూరి, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అబ్బురపరిచింది ఈ మాస్ ఎంటర్ టైనర్. డైరెక్టర్ పూరి, రామ్ ని ఊర మాస్ తెలంగాణా పోరగాడిగా ఓ రేంజ్ లో తెర పై ప్రెజెంట్ చేశారు. కాగా ఈ చిత్రంలోని ఓ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనంగా మారింది.

హీరో రామ్, హీరోయిన్లైనా నిధి అగర్వాల్, నభా నటేష్ కాంబినేషన్ వచ్చే ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ కేవలం విడుదలైన నాలుగు రోజులలో 10మిలియన్స్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. థియేటర్లో బీ, సీ సెంటర్ల చేత స్టెప్పులు వేయించిన ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. లిరిక్స్, సంగీతం, చిత్రీకరించిన విధానం అన్నీ చక్కగా కుదరడంతో పాటకు బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.

ముఖ్యంగా మణిశర్మ అందించిన మాస్ బీట్ కి రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్ అలాగే నాభా నటేష్, నిధిల హాట్ సెట్స్ తోడవ్వడంతో పాట ఓ రేంజిలో పేలింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మాతగా తెరకెక్కిన రామ్ పూరీలా అపజయాలకు అడ్డుకట్టవేసి, విజయాల బాట పట్టించింది.