Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh
Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh

ఇస్మార్ట్ శంకర్…రామ్ హీరోగా,పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు పూరి నుండి వచ్చిన మాస్ మసాలా సినిమాలోనే హయ్యెస్ట్ మాస్ డోస్ తో తెరకెక్కింది అని ట్రైలర్ తో కన్వే అయ్యింది.సెన్సార్ కట్స్ పడితే రెండు నిమిషాల పైన ఉన్న ఈ ట్రైలర్ నిమిషం నిడివికి తగ్గిపోతుంది.దీన్ని బట్టి ఈ సినిమాలో కంటెంట్ ఎంత నాటుగా ఉంది అనేది తెలుస్తుంది.సినిమా బడ్జెట్ కూడా పర్లేదు అనిపించేలా పెట్టారు.సాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కూడా బాగానే పలికాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ థియేట్రికల్ బిజినెస్ మాత్రం అనుకున్న రేంజ్ లో పలకట్లేదు.పాటలు,ప్రోమోలు,ప్రమోషన్స్ అన్నిటిలో మాస్ మాస్ అని చెబుతున్నా అనుకున్న రేటు మాత్రం రావట్లేదు.దీంతో ఈ సినిమా రిలీజ్ చెయ్యమని దిల్ రాజు దగ్గరికి వెళ్లారు.కానీ ఆల్రెడీ మెహబూబా తో దెబ్బతిన్న దిల్ రాజు మాత్రం నో చెప్పేసాడు.కానీ చివరికి బిజినెస్ కాకపోతే మాత్రం నైజాం,ఉత్తరాంధ్ర వరకు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు తప్ప ఒక్క పైసా కూడా అడ్వాన్స్ ఇవ్వలేదు అని టాక్.మరి పూరి,ఛార్మి ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మినిమమ్ సూపర్ హిట్ టాక్ తో ఈ టెస్ట్ పాస్ అయితే తప్ప డబ్బులు రావడం కష్టమే.ఈ సినిమా ఫలితం మీదే ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]