Ram Ismart Shankar Movie Re release For Puri Jagannadh Birthday Special
Ram Ismart Shankar Movie Re release For Puri Jagannadh Birthday Special

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో లాభాల జోన్‌ లోకి వెళ్ళిపోయింది. ఈ చిత్రం ఏపీ మరియు తెలంగాణలో బి మరియు సి కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. మొత్తానికి ఈ విజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ ఇద్దరూ తమ పరాజయాల పరంపర నుండి బయటపడ్డారు.

ముఖ్యంగా పూరి. ఈ విజయం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వరుసగా సినిమాల్ని ఓకే చేసుకుంటున్నారు. అయితే తాజాగా పూరి తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. ఈ నెల 28న పూరి పుట్టినరోజు. ఈ సందర్బంగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల రీరిలీజ్ చేయడానికి పూరి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయట. అయినా రీసెంట్ గా విడుదలైన సినిమాని మళ్లీ విడుదల చేయడం ఏమిటో..?

ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు పూరి. కాగా విజయ్ దేవరకొండ సినిమా తర్వాత, పూరి.. బాలయ్య బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ కూడా ఎప్పుడో రెడీ అయిపోయిందట. ఈ కథలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పూరి ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.