Ram Pothineni ,'iSmart Shankar' Nidhhi Agerwal ,Nabha Natesh
Ram Pothineni ,'iSmart Shankar' Nidhhi Agerwal ,Nabha Natesh

పూరి సినిమాలు తీసే స్టైల్ మాత్రమే కాదు అతని స్పీడ్ కూడా మిగతా డైరెక్టర్స్ అందుకోవడం కష్టం.అందుకే పూరి ఒక్కసారి డేట్ లాక్ చేసాడు అంటే ఏది ఏమైనా ఆ డేట్ కి థియేటర్ లో బొమ్మ పడాల్సిందే.లేట్ అయ్యింది అని,దానికి కారణం ఇది అంటూ ఎక్సప్లనేషన్స్ ఉండవు.హిట్టా?,ఫట్టా? అనే రిజల్ట్ మాత్రమే ఉంటుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

మహేష్ లాంటి స్టార్ హీరోని పెట్టుకుని,బిజినెస్ మ్యాన్ లాంటి సినిమానే రికార్డ్ టైం లో ఫినిష్ చేసిన పూరి ఇస్మార్ట్ శంకర్ కి మాత్రం చాలా టైం తీసుకున్నాడు.ప్రస్తుతం అవుట్ ఆఫ్ ఫార్మ్ లో హిట్ అందుకోవడానికి కష్టపడుతుండడం,ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవడం వంటి కారణాలతో ఈసారి కాస్త కాన్షియస్ గా హిట్ ఒక్కటే మైండ్ లో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా సినిమా తీసాడు.అలాగే ఈసారి ముందు డేట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ కూడా చేసాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే దానికి కారణం సినిమా కంప్లీట్ కాకపోవడం కాదు.వరల్డ్ కప్ ఫైనల్ జులై 14 న జరుగుతుంది.ఇస్మార్ట్ శంకర్ జులై 12 న రిలీజ్ చేస్తే కీలకమయిన ఫస్ట్ వీకెండ్ వసూళ్ళలో మామూలు డ్రాప్ ఉండదు.ఎలా చూసుకున్నా ఇది సినిమాకి చాలా పెద్ద దెబ్బ.అందుకే ఈ సినిమాని జులై 18 కి పోస్ట్ పోన్ చేశారు.కాకపోతే ఆ తర్వాతి వారమే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతుండడం కూడా ఇస్మార్ట్ శంకర్ కి కాస్త ఇబ్బందికరమే.కాకపోతే ఈ సినిమామీద ఉన్న నమ్మకంతో ఆ డేట్ కమిట్ అయిపోయారు.

[INSERT_ELEMENTOR id=”3574″]