Full Craze On Ram Ismart Shankar Movie, Film Preview, Cast
Full Craze On Ram Ismart Shankar Movie, Film Preview, Cast

విడుదల తేదీ : జూలై 18, 2019
రేటింగ్ : 3/5
నటీనటులు : రామ్ పోతినేని,నిధి అగర్వాల్,నభా నటేష్,షాయాజీ షిండే,ఆశిష్ విద్యార్థి
దర్శకత్వం : పూరి జగన్నాధ్
నిర్మాత‌లు : ఛార్మి,పూరి జగన్నాధ్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ

[INSERT_ELEMENTOR id=”3574″]

పూరి జగన్నాథ్…ఒకప్పు ఈ పేరుకి మాస్ లో,యూత్ లో ఉన్న క్రేజ్ హీరోలతో సమానంగా ఉండేది.హీరో ఎవరయినా పూరి చేతులో పడితే,పూరి సినిమాలోకి ఎంటర్ అయితే కొత్తగా మారిపోవాల్సిందే.అయితే ఇదంతా గతం.ఇప్పుడు పూరి పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు.అందుకే అతని నుండి సినిమా వస్తుంది అన్నా కూడా మినిమమ్ బజ్ కూడా ఉండట్లేదు.అయితే ఈసారి మాత్రం హిట్ పడితే,డబ్బులు వస్తే ఇండస్ట్రీ లో ఉండడం లేకపోతే సర్దుకోవడమే అనే పరిస్థితి వచ్చింది.గతంలో కూడా ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు పోకిరి,టెంపర్ లాంటి భారీ హిట్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.ఈసారి కూడా తనలో ఉన్న ఊర మాస్ ని బయటకి తీసి ఇస్మార్ట్ శంకర్ ని రాసుకున్నాడు.ఉన్నవన్నీ పెట్టి సినిమాని పట్టాలెక్కించాడు.ఫైనల్ గా ప్రేక్షకులముందుకు తెచ్చాడు.

కథ:

పాతబస్తీ లో ఒక సుపారీ కిల్లర్ అయిన శంకర్ కాకా అనే రౌడీ తో కలిసి సెటిల్మెంట్స్ చేస్తుంటాడు.అలా ఒక బిల్డర్ దగ్గరికి సెటిల్మెంట్ కోసం వెళ్లి అక్కడ చాందిని చూస్తాడు.ఆమె క్యారెక్టర్,యాటిట్యూడ్ నచ్చి ఆమెని లవ్ చేస్తాడు.ఆమె కూడా శంకర్ ని లవ్ చేస్తుంది.తన అలవాటు ప్రకారం ఒక పెద్ద పొలిటీషియన్ ని మర్డర్ చేసి చాందిని తో కలిసి హైదరాబాద్ నుండి దూరంగా పారిపోతాడు.కానీ పోలీసులకు విషయం తెలిసి శంకర్ ని అటాక్ చేస్తారు.ఆ అటాక్ లో చాందిని చనిపోతుంది.శంకర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.కానీ అతను జైలు నుండి తప్పించుకుని చాందిని చావుకు కారణం అయిన వాళ్ళ మీద పగతీర్చుకోవాలనుకుంటాడు.ఆ క్రమంలో అతనికి CBI ఆఫీసర్ అరుణ్ కలుస్తాడు.కానీ వెంటనే అటాక్ లో చనిపోతాడు.దాంతో అతని మెమరీ ని శంకర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అరుణ్ లవర్ అయిన సారా.అరుణ్ మెమరీ కూడా వచ్చిన తరువాత శంకర్ ఎలా శత్రువులను కనిపెట్టి,వాళ్ళని అంతం చేసాడు అనేది సినిమా కథ.

[INSERT_ELEMENTOR id=”3574″]

నటీనటులు:

ఇస్మార్ట్ శంకర్ కి పూరి గత సినిమాల్లా సో సో గా కాకుండా కాస్త బావుంది అనిపించుకుంది అంటే పూర్తి క్రెడిట్ రామ్ కే ఇచ్చెయ్యొచ్చు.పూర్తిగా పూరికి సరెండర్ అయిపోయిన రామ్ ఎనర్జీ పరంగా మాత్రం తన 2.0 ని చూపించాడు.పూరి చెప్పిన శంకర్ క్యారెక్టర్ ని,యాటిట్యూడ్ ని,బోడీ లాంగ్వేజ్ ని ఫస్ట్ ఫ్రేమ్ నుండి మొదలు పెట్టి చివరి ఫ్రేమ్ వరకు ఎక్కడా డ్రాప్ కాకుండా చూసుకున్నాడు.హైదరాబాదీ స్టయిల్ లో అతను చెప్పిన మాస్ డైలాగ్స్ కి క్లాప్స్ మామూలుగా పడట్లేదు.ఇక డాన్సుల్లో,ఫైట్స్ లో రామ్ ఎనర్జీ అలరించింది.నాభా నటేష్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాల సర్ప్రైసింగ్.ఏకంగా హీరోతో పోటీ పది నాటు మాటలు మాట్లాడడంతో సెన్సార్ కత్తెరలు పడ్డాయి.ఇక నిధి అగర్వాల్ కి హీరోయిన్ అనేంత స్కోప్ దక్కలేదు.రెండు పాటల్లో మాత్రం గ్లామరస్ గా కనిపించింది.షియాజీ షిండే,ఆశిష్ విద్యార్థి లాంటి పూరి కాంపౌండ్ నటీనటులు ఓకే అనిపించారు.గెట్ అప్ శ్రీను,సత్యదేవ్ సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు.పూరి పూర్తిగా రామ్ కి రాసుకున్న క్యారెక్టర్ మీదే ఫోకస్ పెట్టాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

టెక్నీషియన్స్:

ఈ మధ్య రైటర్ గా,డైరెక్టర్ గా కూడా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న ఈ సినిమా విషయంలో కాస్త జాగ్రత్త పడ్డాడు.కానీ రామ్ హీరో గా దొరకడం పూరి అదృష్టం అనాల్సి వచ్చింది సినిమా చూసాక.తమ మొదటి సినిమా నుండి కథ అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోని పూరీ ఈ సినిమాకి కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోయాడు.సీన్స్ కూడా గొప్పగా లేవు.కానీ డైలాగ్ రైటర్ గా పూరి కాస్త బెటర్ అవుట్ ఫుట్ ఇచ్చాడు.చాల చోట్ల మొహమాటపడకుండా హీరో,హీరోయిన్స్ తో ఘాటు బూతులు మాట్లాడించాడు.అందుకే సెన్సార్ చాలా సీన్స్ లో డైలాగ్స్ మ్యూట్ చేసింది.ఇక మణిశర్మకి ఈ మధ్య కాలంలో ఇదే పెద్ద ఆఫర్ కావడంతో కాస్త మంచి ఆల్బమ్ ఇచ్చాడు.ఇక ఆర్.ఆర్ లో అయితే తనే కింగ్ అనిమరోసారి నిరూపించుకున్నాడు.సీన్ ని రామ్ నిలబెడితే దాన్ని మణిశర్మ ఫుల్ గా ఎలివేట్ చేసి శంకర్ కి పాస్ మార్క్స్ వేయించారు.అర్జున్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ రాజు తోట పూరి మార్క్ ఫ్రేమింగ్ తో ఆకట్టుకున్నాడు.ఫైట్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాయి.గోవా లో,మాల్ దీవ్స్ లో షూట్ చేసిన సాంగ్స్ చాలా లావిష్ గా ఉన్నాయి.నిర్మాతలుగా ఛార్మి,పూరి సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు .

ఫైనల్ గా:

రామ్ హీరోగా దొరక్కపోయి ఉంటే,ఇది ఓన్లీ మాస్ కంటెంట్ అని ప్రొజెక్ట్ చెయ్యకపోయి ఉంటే,పూరి శంకర్ కి మాస్ పంచెస్ రాయకపోయి ఉంటే ఇస్మార్ట్ శంకర్ డిజాస్టర్ కంటెంట్.సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదు.కానీ రామ్ ఏం నమ్మి ఏ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడో దానికి పే ఆఫ్ లభించింది.రామ్ కష్టమే ఇస్మార్ట్ విజయం.మాస్ కి ఓకే అనిపించేసిన ఈ సినిమా ఫామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనే హోప్ సినిమా టీమ్ కే లేదు.అదే నిజం అయ్యింది.మాస్ మసాలా సినిమాలు ఇష్టపడేవాళ్ళకి.ముఖ్యంగా యూత్ కి నచ్చేస్తాడు తలతిక్కగా ఉన్న డబుల్ ఇస్మార్ట్ శంకర్.ఈ సినిమా అద్భుతాలు చేయలేకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అవ్వడం మాత్రం గ్యారంటీ.

బోటమ్ లైన్:ఇస్మార్ట్ శంకర్…ఫుల్ హార్డ్ మాస్

[INSERT_ELEMENTOR id=”3574″]