రామ్ ‘రెడ్’ ఓటీటీ రిలీజ్ డేట్

295
ram-latest-movie-red-ott-release-date
ram-latest-movie-red-ott-release-date

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల విడుదల చేసిన సినిమా రెడ్. ఈ సినిమాలో రామ్ రెండు పాత్రల్లో కనిపించి అందరినీ అలరించారు. ఇందులో మాళవిక శర్మా, అమృత అయ్యర్ హీరోయిన్‌లుగా నటించారు. రామ్ కెరీర్ ప్రారంభంలో హిట్‌లు అందుకున్న తరువాత వరుస ప్లాప్‌లు చవిచూశారు. ఆ తరువాత మాస్ దర్శకుడు పూరి డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు.

 

 

 

ఆ తరువాత కిషోర్ తిరుమల దర్వకత్వంలో రామ్ తెరకెక్కించిన సినిమా రెడ్. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ NXT భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమాను ఈ నెల23 లేదా 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ NXT లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా రామ్ కెరీర్‌లో ఎంతో ప్రతిస్టాత్మకంగా రూపొందిచారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.