Homeసినిమా వార్తలుBoyapatiRAPO: అంతమంది ఫైటర్స్ తో రామ్ మాస్ యాక్షన్ షురూ....బోయపాటి మామూలోడు కాదు

BoyapatiRAPO: అంతమంది ఫైటర్స్ తో రామ్ మాస్ యాక్షన్ షురూ….బోయపాటి మామూలోడు కాదు

రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో #BoyapatiRAPO సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా టైటిల్ ని మే 15న రామ్ బర్తడే సందర్భంగా  విడుదల చేయుటకు సిద్ధం చేశారు.. దీనితోపాటు ఫస్ట్ థండర్ అంటూ వీడియోను కూడా విడుదల చేయుటకు అనౌన్స్ చేయడం జరిగింది. బోయపాటి కాంబినేషన్లో రావడం వల్ల ఈ సినిమాపై రామ్ ఫ్యాన్స్ కి భారీగా అంచనాలే ఉన్నాయి.

దర్శకుడు బోయపాటి శ్రీను అంటేనే మా యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఫస్ట్ థండర్ అంటూ విడుదల చేసిన పోస్టర్లు రామ్ (Ram Pothineni) ని మాస్ అవతారంలో చూడవచ్చు. #BoyapatiRAPO అనే టైటిల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా చేస్తుంది. బోయపాటి శ్రీను అంటేనే హీరోలని మాస్ ఎలివేషన్స్ తో ఆకట్టుకుంటారు అదే విధంగా ఈ సినిమాలో కూడా రామ్ పోతినేని క్యారెక్టర్ ని డిజైన్ చేయడం జరిగిందంట.

ఇప్పుడు ఫిలింనగర్ లో న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బోయపాటి శ్రీను ఈ సినిమా కోసమని 1500 మంది ఫైటర్స్ తో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని క్రియేట్ చేయడం జరిగిందంట. ఈ యాక్షన్స్ సన్నివేశాలకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయినట్లు చెబుతున్నారు. రామ్ సినిమాలో ఎప్పుడు చూడని విధంగా ఈ ఫైట్ ని డిజైన్ చేయటమే కాకుండా సినిమాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత దానికి మించిన మాస్ సినిమాతో రామ్ మనల్ని అల్లరించబోతున్నారు.

BoyapatiRAPO First Thunder on May 15th

ఈ కథపై రామ్ కి ఉన్న నమ్మకంతో పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 20న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Web Title: Ram pothineni action among 1500 fighter in boyapati movie, Sreeleela, BoyapatiRAPO Title Release date, BoyapatiRAPO First Thunder on May 15th, Ram Pothineni birthday special updates.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY