Boyapati RAPO Shooting Update: రామ్ పోతినేని అలాగే బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో BoyapatiRAPO సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ రోజు ప్రారంభించినట్టు అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది.
రామ్ పోతినేని (Ram Pothineni) ఈ సంవత్సరం వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక లేకపోయింది. దీంతో రామ్ ఇప్పుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో BoyapatiRAPO వస్తున్న దాని పై ఆశలు పెట్టుకున్నారు.
దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఈచింది చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ (Boyapati RAPO shooting) గురవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది చిత్రబృందం. అంతేకాకుండా ఈ క్రేజీ ప్రాజెక్టులో శ్రీలీలను (Sreeleela) హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని కన్ఫర్మ్ చేశారు. బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత బోయపాటి మళ్లీ తమన్ ఈ సినిమాకి పని చేపిస్తున్నారు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ మాస్ యాక్షన్‌కు సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ చిత్ర కథను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.