RAPO Double Ismart Look Makeover Video: రామ్ పోతిని ప్రస్తుతం బోయపాటి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కాకముందు లే రామ్ మళ్లీ ఇస్మార్ట్ కాంబినేషన్ ని తెరపైకి తీసుకువచ్చారు. ఈసారి డబల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసం పూరి జగన్నాథ్ అలాగే రామ్ పోతినేని కలిసి వస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే.
RAPO Double Ismart Look Makeover Video: బోయపాటి సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ మేకోవర్ లోకి వచ్చేసాడు Ram Pothineni. దీనికి సంబంధించిన మేకవర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హాకిన్, రామ్ ని ఇస్మార్ట్ లుక్ లోకి తీసుకురావడం మనం చూడవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ 2019లో విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత రామ్ కి అలాగే పూరి జగన్నాథ్ కి అనుకున్న స్థాయిలో భారీ విజయం అందలేదు. రామ్ కూడా ఇప్పుడు బోయపాటి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ బోయపాటి సినిమా కనుక భారీ విజయాన్ని సాధిస్తే డబల్ ఇస్మార్ట్ సినిమా మీద కూడా దానికి మించిన అంచనాలు పెరుగుతాయి. రామ్ కొద్ది కాలంగా మాస్ ఇమేజ్ కోసం చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు.

బోయపాటి శ్రీను అలాగే పూరి జగన్నాథ్ సినిమాలతో మాస్ ఇమేజ్ ని దక్కించుకుంటాడో లేదో చూడాలి. ఇస్మార్ట్ శంకర్ కేవలం తెలుగులోనే విడుదల చేయగా ఇప్పుడు Double Ismart సినిమా ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. Double Ismart Shooting రేపటి నుంచి హైదరాబాదులో మొదలుకానుంది. ఈ సినిమాని కూడా పూరి జగన్నాథ్ అలాగే చార్మి కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలవ్వబోతుంది. ఇక డబల్ ఇస్మార్ట్ సినిమాలో నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.