రామ్ తో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ !

244
Ram Pothineni Film with Jathi Ratnalu Director Kv anudeep
Ram Pothineni Film with Jathi Ratnalu Director Kv anudeep

అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ‘జాతిర‌త్నాలు’ చిత్రం రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, న‌వీన్ పొలిశెట్టి కామెడీ ట‌చ్‌తో ఫ‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ మంచి టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీతో ఫ‌రియాఅబ్దుల్లా సిల్వర్ స్క్రీన్‌కు ప‌రిచ‌య‌మైంది.

 

 

ఈ చిత్రం రెండు రోజుల్లోనే 9 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే అనుదీప్ రెండో సినిమా ఏంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జాతిరత్నాలు కంటే ముందు ‘పిట్టగోడ’ సినిమా చేశాడు అనుదీప్. కానీ ఈ సినిమా వచ్చి వెళ్లిన విషయం చాలా మందికి తెలియదు. ఈయన మూడో సినిమా మాత్రం మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.

 

 

దీనికోసం రామ్ పోతినేనిని ఎంచుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే ఈయనకు లైన్ చెప్పి ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. స్రవంతి మూవీస్, వైజయంతి మూవీస్ సంయుక్తంగా అనుదీప్ తర్వాతి సినిమాను నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.