రామ్‌ #RAPO19 షూటింగ్ షురూ.. డీటెయిల్స్..!

Ram Pothineni RAPO19 Shoot: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని షూటింగ్ (shooting) చేయడానికి రెడీ. బౌండ్ స్క్రిఫ్ట్‌తో దర్శకుడు లింగుసామి రెడీ. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఓ ఊర మాస్ సినిమా నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న తొలి బైలింగ్వల్ సినిమా ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి సూప‌ర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లింగుసామి చేస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది.

రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించనున్నారు. ‘దృశ్యం’, ‘లూసిఫర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు అని చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ‘కె.జి.యఫ్’ చిత్రానికి పని చేసిన అన్బు-అరివు ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఇటీవల ‘క్రాక్’ చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసిన ప్రముఖ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

జూలై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందట. చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కాగా.. కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles