Homeసినిమా వార్తలురామ్ ‘స్కంద’ నుంచి ‘గందారబాయి’ సాంగ్ విడుదల.

రామ్ ‘స్కంద’ నుంచి ‘గందారబాయి’ సాంగ్ విడుదల.

Ram Pothineni and Sreeleela next Skanda Second song Gandara bai released, Skanda movie songs, Boyapati Sreenu new movie, Skanda release date, Skanda USA live updates

Skanda Second song Gandara bai: సరైనోడు, అఖండ బ్లాక్ బస్టర్స్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ థమన్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి మూడవ చిత్రానికి కొలబరేట్ అయ్యారు. ఉస్తాద్ రామ్ పోతినేని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్ ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మేకర్స్ సెకండ్ సింగిల్ గందారబాయి లిరికల్ వీడియోని విడుదల చేశారు.

Skanda Second song Gandara bai: ఎస్ఎస్ థమన్ మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించారు. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, గందారబాయి మాస్ ధమకేధార్ ఫోక్లోర్. బీట్, ఆర్కెస్ట్రేషన్ ఎనర్జిటిక్ గా మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నాయి. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించారు.

రామ్, శ్రీలీల తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు.ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. వాళ్ళ డ్యాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ నంబర్ కు కొరియోగ్రఫీ చేశారు.

Ram Pothineni and Sreeleela next Skanda Second song Gandara bai released
Ram Pothineni and Sreeleela next Skanda Second song Gandara bai released

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

Ram Pothineni and Sreeleela next Skanda Second song Gandara bai released, Skanda movie songs, Boyapati Sreenu new movie, Skanda release date,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY