Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh
Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh

తెలుగులో సరయిన మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది.అందుకే ఆ తరహా సినిమాలను అభిమానించే వాళ్ళు,ఆదరించే వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు అని గుర్తించిన పూరి జగన్నాథ్ తనలోని పూర్తి మాస్ ని బయటికి తీసి ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కించాడు.టీజర్ తోనే ఈ సినిమాలో మాస్ కంటెంట్ కాస్త ఘాటుగా ఉంటుంది అని అర్ధమైపోయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇక ఇప్పుడు వచ్చిన ట్రైలర్ తో ఆ ఘాటు మామూలుగా ఉండదు అని కన్వే అయిపోయింది.రామ్ లుక్స్,అతని లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్,హీరోయిన్స్ బోల్డ్ అప్పీరెన్స్…అన్నీ కూడా పక్కా మాస్ టార్గెటెడ్ గా ఉన్నాయి.ఇయర్ ఫోన్స్ లేకపోయినా ఈ కంటెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అని ట్రైలర్ లో బిగినింగ్ కార్డు వేసాడంటే పూరి ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.ఇక అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న మణిశర్మ ని ఎందుకు తీసుకున్నాడా? అనుకున్న వాళ్ళకి ఈ ట్రైలర్ చూస్తే క్లారిటీ వస్తుంది.ఆర్.ఆర్ లో మణి మార్క్ మ్యాజిక్ కనిపిస్తుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఈ సినిమాతో పూరి సాలిడ్ హిట్ కొట్టేస్తున్నాడు ముందే టాక్ రావడంతో సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది.నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 14 కోట్లు వచ్చాయంటే ఈ సినిమాపై ఎలాంటి టాక్ నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చు.ప్రొడక్షన్ కి 20 కోట్లు పైగా ఖర్చయ్యింది.అంటే పెట్టిన దాంట్లో దాదాపు 70 శాతం నాన్ థియేట్రికల్ లో వచ్చింది.పూరి ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో క్రేజీ బిజినెస్ జరుపుకుంటున్న సినిమా ఇదే.ఇస్మార్ట్ శంకర్ రైట్స్ కి ట్రైలర్ కి ముందు బేరాలు సాగాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ ఇప్పుడు ఎక్కువ సేపు బేరం ఆడితే ఎక్కడ వేరే వాళ్ళు సినిమా కొనేస్తారో అనే టెన్సన్ లో ఉన్నారు బయ్యర్స్.హిట్ కొట్టడానికి తన కంఫర్ట్ జోనర్ ని కూడా వదులుకుని ప్రయోగం చేసిన పూరి అది వర్క్ అవుట్ కాకపోవడంతో రియలైజ్ అయ్యాడు.దాని రిజల్ట్ ఈ సినిమా.కథ కూడా కాస్త తిక్క తిక్కగా ఉన్నా,అది అందరికి నచ్చేలా ఉంది.ముఖ్యంగా శంకర్ యాటిట్యూడ్ పీక్స్ అని చెప్పుకోవచ్చు.ట్రైలర్ లో కాస్త ఎక్కువ బూతులు ఉన్నా ఎవ్వరూ కామెంట్స్ చెయ్యట్లేదు.సో,సెన్సార్ దగ్గర కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.సో,ట్రైలర్ ఉన్నట్టే సినిమా ఉంటే మాత్రం ఇస్మార్ట్ శంకర్ పూరి దశ మార్చేస్తుంది,మళ్ళీ ఫుల్ బిజీ చేస్తుంది అనే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.

[INSERT_ELEMENTOR id=”3574″]