Homeసినిమా వార్తలుమనసును ఆహ్లాద పరుస్తున్న ద సోల్ ఆఫ్ ఆది పురుష్.!!

మనసును ఆహ్లాద పరుస్తున్న ద సోల్ ఆఫ్ ఆది పురుష్.!!

Ram Sita Ram The soul of Adipurush Song, Adipurush movie songs, Adipurush release date, Prabhas Adipurush songs, Kriti Sanon, Adipurush Trailer, Adipurush second song

Ram Sita Ram: The soul of Adipurush Song: ప్రభాస్ హీరోగా విడుదలకు సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి అలాగే పలు రకాల విమర్శలు కూడా ఈ సినిమాని వెంటాడు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన జై శ్రీరామ్ పాట కాస్త సినిమా మీద డివోషనల్ యాంగిల్ ని పెంచడంతోపాటు మూవీపై మొదటి నుంచి వస్తున్న నెగిటివ్ టాక్ ని కాస్త కోస్తా తగ్గించింది అని చెప్పవచ్చు.

Ram Sita Ram: The soul of Adipurush Song: అయితే తాజాగా విడుదల చేసిన ద సోల్ ఆఫ్ ఆదిపురుష్ పాట మాత్రం చిత్రం మీద మొత్తం నెగిటివీ పక్కన పెట్టింది అని కొందరు భావిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేసిన ఈ పాట వీనుల విందుగా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. సీత దూరమైన సందర్భంలో రాముడు (ప్రభాస్ Prabhas) పడిన బాధ అలాగే రాముడికి దూరమై సీత పడుతున్న వ్యధ అద్భుతమైన విజువల్స్ రూపంలో ఈ పాటలో చిత్రీకరించారు.

ద సోల్ ఆఫ్ ఆది పురుష్ నిజంగానే ద సోల్ ఆఫ్ సీతారామ అనే విధంగా చూసే వారిని ఆకట్టుకుంటుంది. అలాగే ఎడబాటు తో సతమతమవుతున్న సీతారాముల మధ్య వారధిలా వ్యవహరించిన హనుమంతుడు ఒకరి గుర్తులను మరొకరికి చూపించడం .. లాంటి విజువల్స్ అన్వేషాలు ఎంతో అందంగా ఉన్నాయి. రామాయణం అందరికీ తెలిసిన స్టోరీ అయినప్పటికీ అది ఎన్నిసార్లు చూసినా మనసుకు హత్తుకునే విధంగానే ఉంటుంది అని మరోసారి ఈ పాట నిరూపిస్తుంది.

Ram Sita Ram The soul of Adipurush Song

ఈ పాటను ఈరోజు ఇవి క్రియేషన్స్ సోషల్ మీడియాలో, మూవీ చానల్స్, ఆన్లైన్ ,టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ ,మూవీ థియేటర్స్ మరియు సుమారు 70 కి పైగా రేడియో స్టేషన్లో ఒకేసారి ఈ పాటను విడుదల చేయడం గా విశేషం. ఒకరకంగా ఈ పాట చిత్రంపై ఉన్న హైప్ ను వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది అని చెప్పవచ్చు. జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Web Title: Ram Sita Ram The soul of Adipurush Song, Adipurush movie songs, Adipurush release date, Prabhas Adipurush songs, Kriti Sanon, Adipurush Trailer, Adipurush second song

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY