రామ్ పోతినేని అలాగే కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమాకు గాను లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మొట్ట మొదటిసారిగా రామ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. విడుదల తేదీ ప్రకటించటంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ని మూవీ టీమ్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ది వారియర్ టీజర్ ని ఈ రోజు విడుదల చేయడం జరిగింది.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.
‘ది వారియర్’ టీజర్లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోను లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

టీజర్లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు టీజర్లో చూపించడం జరిగింది. ‘ఆట బానే ఉంది, ఆడేద్దాం’ అంటూ ఆది పినిశెట్టి చెప్పడం, ఆయన గెటప్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి.
యాక్షన్ ప్రియులను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని రామ్, నదియా సీన్ చూస్తే అర్థం అయ్యింది. విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ‘ది వారియర్’ టీజర్ వైరల్ అయ్యింది. సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక పాట మినహా నుంచి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పాటను కూడా ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
మొత్తం మీద రామ్ రామ్ ది వారియర్ టీచర్ తో సినిమాపై అంచనాల్ని భారీ స్థాయిలో పెంచడమే చెప్పాలి. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల హెడ్ కు సిద్ధం చేస్తున్నారు.