Homeరివ్యూస్రామబాణం మూవీ రివ్యూ: మళ్లీ బోల్తా పడ్డ గోపీచంద్

రామబాణం మూవీ రివ్యూ: మళ్లీ బోల్తా పడ్డ గోపీచంద్

Gopichand latest movie Rama Banam Review in Telugu, Rama Banam telugu Review, Rama Banam Review & rating, Rama Banam rating and public talk,

Rama Banam Review: గత కొద్ది కాలంగా గోపీచంద్ హీరోగా నిలబడడానికి తెగ ప్రయత్నిస్తున్నప్పటికీ ఏ మూవీ అంతగా కలిసి రావడం లేదు. అయితే తాజాగా గోపీచంద్ నటించిన రామబాణం మూవీకి శ్రీనివాస్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహించారు. శ్రీనివాస్ గతంలో డైరెక్టర్ గా పరిచయమైన చిత్రం గోపీచంద్ హీరోగా చేసిన లక్ష్యం. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లౌక్యం కూడా మంచి హిట్ అయింది. దీంతో ఇద్దరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రమైన రామబాణంపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. మరి ఈరోజు విడుదలైన రామబాణం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం…

Rama Banam telugu review & Rating: 2/5
తారాగణం: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్ .
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
దర్శకత్వం: శ్రీవాస్
విడుదల తేదీ: 5 మే 2023

కథ: సినిమా టైటిల్ మరియు ప్రోమో చూస్తే ఎవరికైనా ఇది ఒక కుటుంబ కథా చిత్రం అనేది సులభంగా అర్థమవుతుంది. కథలోకి వెళ్తే రఘుదేవపురం అనే ఊరిలో ఆర్గానిక్ పంటల ద్వారా పండించిన కూరగాయలు మరియు దినుసులతో మాత్రమే ఉపయోగించి వంటలు చేసే హోటల్ నడుపుతూ ఉంటాడు రాజారామ్ (జగపతిబాబు). అతని టీనేజ్ తమ్ముడి క్యారెక్టర్ విక్కి (పెద్దయ్యాక గోపీచంద్ అవుతాడు). అయితే రాజారాంకు పూర్తి విరుద్ధంగా ఉండే వ్యక్తి పాపారావు ( నాజర్) ఆర్గానిక్ హోటల్ వల్ల తన వ్యాపారం దెబ్బతింటుందని జగపతిబాబుకు విరుద్ధంగా కుట్రలు పన్నుతాడు.

ఇందులో భాగంగా రాజా రామ్ హోటల్ లైసెన్స్ ను రుబాబు పట్టుకుపోతాడు పాపారావు. ఇది తెలిసిన వ్యక్తి పాపారావు గోడ ఉన్న కాల్ చేసి ఆ లైసెన్స్ ను వెనక్కి తీసుకు వస్తాడు. అయితే చిన్న వయసులోనే హింసవైపు అడుగు వేస్తున్న తమ్ముడిని రాజారామ్ గట్టిగా మందలిస్తాడు. జీవితంలో ఏదో ఒకటి అయ్యాకే వెనక్కి వస్తానని పంతంతో విక్కి కలకత్తా రైలెక్కేసి పారిపోతాడు. అయితే కొన్ని కారణాలవల్ల మళ్లీ బంధాలను వెతుక్కుంటూ విక్కి వెనక్కి తిరిగి వస్తాడు? ఆ కారణమేమిటి? విక్కీ ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత ఏం చేశాడు? రాజారామ్ ను విక్కి ఏ రకంగా రక్షించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మిగతా కథ పెద్ద స్క్రీన్ లో చూడాల్సిందే

వివరణ: ఈ సినిమా స్టోరీ చూసిన ఎవరికైనా చిన్నతనంలో చదివిన చందమామ కథ గుర్తుకు వస్తుంది. పాత్రలో పెద్ద కొత్తదనం లేదు. కాన్సెప్ట్ కొత్తది కాదు. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ మిక్సీలో వేసి జ్యూస్ చేసి ప్రేక్షకుల ముందు పెట్టినట్టు ఉంది రామబాణం పరిస్థితి. శంకర్ దాదా ఎంబిబిఎస్ లో చిరంజీవి హింసను తండ్రి మందలించారు…అతడులో ఇంట్లో తిడతారని పార్ధు పారిపోయాడు….. భాషలో రజనీకాంత్ తన తమ్ముడి దగ్గర తన గతం దాచుతారు…అన్న అతి మంచితనం వల్ల విలన్లు ఏర్పడడం…అన్నకు తెలియకుండా తమ్ముడు వెళ్లి వాళ్లకి బుద్ధి చెప్పడం.. అటు ఇటుగా ప్రతి సినిమాలో కనిపించే విషయం. ఎండింగ్ కూడా పెద్ద ట్విస్టర్ లేకుండా ఈజీగా గెస్ చేసే విధంగా ఉంది.

పైగా ఈ కథలో కొన్ని పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. అసలు వాటిని ఎందుకు పెట్టారో డైరెక్టర్ కే స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. హీరోయిన్ అని చెప్పుకోవడానికి ఓ పాత్ర ఉండాలి కాబట్టి కథలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ ను, అప్పుడప్పుడు కాస్త నవ్వాలి కాబట్టి కమెడియన్ క్యారెక్టర్ లను స్టోరీలో బలవంతంగా దూర్చారు. దీనికి తోడు అతడు మూవీలో మహేష్ బాబు టైప్ లో హై వోల్టేజ్ ఫైట్లు, ఒక్క క్లిక్ తో 50 కోట్ల మొబైల్ ట్రాన్స్ఫర్.. అఫ్కోర్స్ అప్పట్లో ఫోన్లు ఫోన్ పేలు లేవు కాబట్టి చెక్కులో పంపించారు.. ఇప్పుడు టెక్నాలజీ వాడారు…అమౌంట్ కూడా ఎక్కువేననుకోండి…అయితే కాన్సెప్ట్ మాత్రం అదే.

- Advertisement -

Gopichand Rama Banam telugu review

ప్లస్ పాయింట్స్:

  • సైట్ల పరంగా గోపీచంద్ పర్వాలేదు ,దానికి తోడు యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగా భారీగానే ఉంది.
  • “నా ప్రాణమాగదు పిల్లో బెంగాలి రసగుల్ల”సాంగ్ కాస్త క్యాచీగా ఎంటర్టైనింగ్ గా ఉంది.

మైనస్ పాయింట్స్:

  • హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఈ సినిమాలో ఉందా …లేదా ,ఉంటే ఎందుకు ఉంది సినిమా మొత్తం చూసిన పెద్దగా అర్థం కాలేదు.
  • ఈ మూవీలో శ్రీనివాస్ డైరెక్షన్ పూర్తిగా వీక్ అని చెప్పొచ్చు.
  • స్టోరీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు చూసిన సినిమా లాగే ఉంది తప్ప కొత్తదనం ఏమీ లేదు.
  • మొదటినుంచి జగపతిబాబు దగ్గర గాంధీ ఇజం హైలెట్ చేయించి లాస్ట్ లో ప్రేక్షకులను మెప్పించడానికి కాస్త ట్రాక్ మార్చడం కాస్త ఆర్టిఫిషియల్ గా ఉంది.
  • వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అయితే పూర్తి ఇరిటేటింగ్ గా ఉంది.

తీర్పు: మంచి వీకెండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఈ సినిమాకి వెళ్ళకండి. కావాలంటే నాలుగు పాత సినిమాలు ఇంట్లో ప్లే చేసుకుని చూస్తే ఈ సినిమా చూసినట్లే. ఎక్కడ కాస్త కూడా కొత్తదనం లేకుండా బోరింగ్ గా సాగే కథా మరియు క్యారెక్టర్స్ రామబాణం ఫెయిల్యూర్ కి కారణాలు అని చెప్పవచ్చు. ఈ సినిమాకి రామబాణం అని కాకుండా రాయి …సుత్తి అని పెడితే బాగుండేది. నిజానికి ఈ స్టోరీ చూస్తే కొత్త కాన్సెప్ట్ ఎక్కడ దొరక్క ఓ 10 పాత సినిమాలను కలిపి ఓ కొత్త సినిమాగా రామబాణం తీసారా అన్న డౌట్ ఎవరికైనా కలుగక మానదు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY

Rama Banam Review: గత కొద్ది కాలంగా గోపీచంద్ హీరోగా నిలబడడానికి తెగ ప్రయత్నిస్తున్నప్పటికీ ఏ మూవీ అంతగా కలిసి రావడం లేదు. అయితే తాజాగా గోపీచంద్ నటించిన రామబాణం మూవీకి శ్రీనివాస్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహించారు. శ్రీనివాస్ గతంలో డైరెక్టర్ గా పరిచయమైన చిత్రం గోపీచంద్ హీరోగా చేసిన లక్ష్యం. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లౌక్యం...రామబాణం మూవీ రివ్యూ: మళ్లీ బోల్తా పడ్డ గోపీచంద్