Jr NTR Komaram Bheem Teaser From RRR telugu movie

Jr NTR Komaram Bheem Teaser From RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతంలో మర్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ అల్లూరిగా రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి.. కరోనా తెచ్చిన లాక్‌డౌన్ కారణంగా ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయలేకపోయారు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఈరోజు 11 గంటలకు ఆర్ ఆర్ ఆర్‌లో భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ విడుదలైంది. కొమురం భీమ్ జయంతి సందర్భంగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజ్ చేశారు జక్కన్న. కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తున్న వారి అంచనాలకు తగ్గకుండా అంతే రీతిలో భీమ్‌గా ఎన్టీఆర్ అదరగొట్టాడు ఎన్టీఆర్. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయింది టీజర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్స్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ తోడు కావడంతో ప్రేక్షకలోకం ఊగిపోతోంది.

”వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చను పాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్..” అంటూ రామ్ చరణ్ పవర్‌ఫుల్ వాయిస్, పోరాట యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ రూపం ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.