Mahesh Babu SSMB28 Update: మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో పని చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈ నెల 12న అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ని ప్రారంభం చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాబోలు సినిమా వస్తుంది.
అన్నపూర్ణ స్టూడియో లో స్టార్ట్ అయిన మహేష్ బాబు SSMB28 (shooting) సినిమా షూటింగ్, మూడు రోజులు పాటు యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించిన తర్వాత ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చేసింది.
త్రివిక్రమ్ SSMB28 సినిమా లో కీలక పాత్ర కోసం ఒక సీనియర్ నటి ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను ఎవరో కాదు అందాల నటి అయిన రమ్య కృష్ణ. ఈమధ్య త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్స్ తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారి లో నదియాని .. అలాగే అలా వైకుంఠపురం లో టబుని.. అజ్ఞాతవాసి కోసం ఖుష్బూని ప్రత్యేక పాత్రల కోసం ఎంపిక చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు SSMB28 సినిమాలో అత్త పాత్ర కోసం రమ్యకృష్ణ (Ramya Krishna) ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఫాన్సు అలాగే మూవీ లవర్స్ ఈ అత్త పాత్ర అత్యంత ప్రత్యేకమైన దా అంటూ ఆరా తీయటం బిగిన్ చేశారు. 2023 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. రమ్యకృష్ణ పాత్ర గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.