(ramya krishnan less remuneration for puri romantic movie) నటించినా, నర్తించినా, జస్ట్ అలా నడిచినా..ఆడియెన్స్ నివ్వెరపోవాల్సిందే. ఆమే వెర్సటైల్ నటి రమ్యకృష్ణ. హీరోయిన్గా నాటి తరంలో కుర్రకారుకు కంటిన్యూగా చెమటలు పట్టించిన శివగామి..సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా సాలిడ్ నటనతో చింపి ఆరేస్తుంది. బాహుబలిలో ఆమె నటించిన శివగామి పాత్రకు మరొక నటిని ఊహించుకోవడం కూడా అసాధ్యం. ఇలా సౌత్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది రమ్యకృష్ణ. ఇప్పటికి కూడా సీనియర్ హీరోల పక్కన రోల్స్ చేయాలంటే ఈ సీనియర్ హీరోయిన్నే ప్రిపర్ చేస్తున్నారు దర్శకులు.
ఈ మధ్య కాలంలో నటి రమ్యకృష్ణకి దక్కిన పాత్రలు .. అవి తెచ్చుకున్న గుర్తింపు ఆమె మార్కెట్ ను మరింతగా పెంచేశాయి. దాంతో ఆమె ఒక్కో సినిమాకి రోజుకి 10 నుంచి 15 లక్షలు ఛార్జ్ చేస్తోందట. అంటే ఆమె 15 రోజులు డేట్స్ ఇవ్వాలంటే, కోటి రూపాయలు సమర్పించుకోవాల్సిందే. అయితే ‘రొమాంటిక్’ సినిమాకి 20 రోజులు కేటాయించినప్పటికీ ఆమె 50 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్టు సమాచారం. కృష్ణవంశీకి, పూరికి మధ్యగల స్నేహం, చార్మీతో తనకి గల స్నేహం కారణంగానే ఆమె ఇంత తక్కువ పారితోషికం తీసుకుందట. ఇక ‘ఫైటర్’ సినిమాలోనూ రమ్యకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుంది.