Rana Daggubati – Director Teja New Movie:రానా దగ్గుబాటి, దర్శకుడు తేజల ఎనర్జిటిక్ అండ్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయనుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రానా దగ్గుపాటితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా అభిమానులని ఆధారించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు తేజ అహింస అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. రానా దగ్గుపాటి తమ్ముడు అభిరామ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. దీని తర్వాత దర్శకుడు తేజ అలాగే రానా దగ్గుపాటి సినిమా షూటింగ్ కి వెళ్ళనుంది.
Rana Daggubati – Director Teja New Movie: ఇక వివరాల్లోకి వెళితే నేనే రాజు నేనే మంత్రి నిర్మాత అయిన ఆచంట గోపీనాథ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈరోజు తేజ అలాగే రానా దగ్గుపాటి మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. 2017లో విడుదలైన నేనే రాజు నేనే మంత్రి బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ల వర్షం కురిపించింది. జోగేంద్ర పాత్రను పరిపూర్ణంగా పోషించిన రానా దగ్గుబాటి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
రానా స్క్రీన్ ప్రెజెన్స్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ మరియు అభిమానులకు బాగా నచ్చాయి, అందుకే సినిమా నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ విజయం సాధించింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ విజయం వెనుక రానా దగ్గుబాటి మరియు కాజల్ అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ కూడా ఒక ముఖ్యమైన అంశం. నేనే రాజు నేనే మంత్రి రానాకు కమర్షియల్‌గా అతిపెద్ద విజయాన్ని అందించడమే కాకుండా దర్శకుడు తేజ కూడా భారీ విజయాన్ని సాధించింది.



అయితే ప్రస్తుతం ఈ సినిమా మల్టీస్టారర్ అని ఫిలిం నగర్ లో టాక్ అయితే వినపడుతుంది. దీని మీద క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అలాగే నేనే రాజు నేనే మంత్రి సీక్వెల్స్ సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది అని కూడా గుసగుసలు వినపడు తున్నాయి. సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్‌కి మంచి క్రేజ్ ఉంటుంది మరియు అదే సమయంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్న హీరో – డైరెక్టర్ కాంబోలకు కూడా మంచి హైప్ వస్తుంది. కాబట్టి, రానా మరియు తేజల ఈ కొత్త చిత్రంపై ప్రేక్షకులు మరియు ట్రేడ్ వర్గాల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
Web Title: Rana Daggubati and Director Teja new movie on cards details, Nene Raju Nene Mantri Combo Back on Cards, Rana Daggubati new movie, Rana Daggubati, Director Teja new movie, Multistarrer, Telugu Movie news