ట్రెండ్ అవుతున్న రానా ‘అరణ్య’ సినిమా ట్రైలర్

226
rana-daggubati-aranya-official-trailer-trending-now
rana-daggubati-aranya-official-trailer-trending-now

రానా దగ్గుబాటి కథానాయకుడిగా ప్రభు సాల్మన్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘అర‌ణ్య’’. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళంలో  ‘కాదన్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఇప్పటికే పోస్టర్లు, టీజర్ తో అంచనాలను పెంచేసింది.

 

 

తాజాగా అరణ్య ట్రైలర్ విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం కాగా.. ‘ఏనుగుల ఇంట్లో.. మనుషుల అరాచకం’ అని రానా చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక రానా యాక్షన్ సీన్స్ లో అడగొట్టాడనే చెప్పాలి. ట్రైలర్ అంత ఏనుగులు, రానా నటనతో ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.  ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.