రానా ”అరణ్య” టీజర్ అదుర్స్..!

Rana Daggubati Aranya Teaser Review
Rana Daggubati Aranya Teaser Review

(Rana Daggubati Aranya telugu movie Teaser Review. Rana next movie Aranya release date and cast details..)”హాథీ మేరా సాథీ” సినిమాలో రానా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ‘అరణ్య’గా పేరుతో విడుదల కానుంది. అరణ్యంలో జంతువులకు రక్షకుడిగా రానా నటిస్తున్నారు. గజరాజు (కుంకీ) ఫేం ప్రభు సోల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2020 పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ ‘హాథీ మేరా సాథీ’ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది.

అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా రానా లుక్ ఆకట్టుకునేలా వుంది. అడవిలో పక్షలు జంతుజాలానికి అర్థమయ్యే భాషలో రానా పిలుపు.. అమాయకత్వం మొరటుదనం కలబోసిన ఆ ఎక్స్ ప్రెషన్ ప్రత్యేకంగా ఆకర్షించింది. మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. రొటీనిటీకి భిన్నమైన పాత్రను ఎంచుకుని రానా ఈసారి భారీ సాహసమే చేస్తున్నాడు. ఇక అతడి మాసిన జుత్తు.. ముఖంపై గాటు చూస్తుంటే అడవిలో భీకర పోరాటాలే చేస్తాడని అర్థమవుతోంది.

మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. ఈ సినిమా టీజర్‌లో రానా నటన అద్భుతంగా వుంది. ఇక అడవి అంటే జంతు జాలంతో పాటు నక్సల్స్ కూడా ఉంటారు కదా! కీకారణ్యంలో తుపాకుల హోరును ఇందులో చూపించారు. ఈ చిత్రంలో పులకిత్ సామ్రాట్- శ్రీయా-జోయా తదితరులు నటించారు. ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.