ఆయన గబ్బర్‌సింగ్‌ అయితే.. నేను ధర్మేంద్ర!

0
213
Rana Daggubati as Blitz of Daniel Shekar from Bheemla Nayak looks out now

Rana Daggubati, Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి ‘రాణా‘ పరిచయ చిత్రం ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం.

డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది. “నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది… నేనెవరో తెలుసా ధర్మేంద్ర … హీరో ..హీరో..! అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.

ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

Also Read: ‘రిప‌బ్లిక్‌` టీజ‌ర్ గురించి సుకుమార్ మాటలో

Rana Daggubati as Blitz of Daniel Shekar from Bheemla Nayak looks out now

ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: ఫస్ట్ గ్లింప్స్ తో చిత్తకొట్టిన భీమ్లా నాయక్! 

 

Previous articleRana first glimpse as Daniel Shekar from the film Bheemla Nayak
Next articleLove Story in Australia and New Zealand, USA Theatres list